అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

Apr 1, 2026 - 20:04
Apr 3, 2026 - 14:00
 0  0
అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. మండల పరిధిలోని నెమికలు పోల్కమకుంట చెరువులో గత 20 రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తాసిల్దారు అమిన్ సింగ్ తెలిపారు. బుధవారం చెరువుల అక్రమట్టి తరలిస్తున్న విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి ఆయన పోలకమ్మకుంటలో మట్టి గుంతలను పరిశీలించారు. అనంతరం మైనింగ్, ఇరిగేషన్ అధికారులతో అక్రమంగా మట్టి తరలించి ప్రైవేటు భూములలో పోసిన మట్టికుప్పులను సీజ్ చేశారు. దండు మైసమ్మ సమీపంలోని ఏయాతి ఫంక్షన్ హాల్ పక్కన పోసిన మట్టి కుప్పలను ప్రైవేటు పువ్వులలో పోసిన మటుకు పులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎక్కడైనా చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేసినట్లయితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నెమ్మికల్ లోని మూడు జేసిబిలను బైండోవర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారి వెంట ఇరిగేషన్ ఎఇ చరణ్ మైనింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.