కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంపై నిర్లక్ష్యం చేస్తే సహించం బిఎస్సీ
చిన్నంబాయి మండల లోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై నిర్లక్ష్యం – బీఎస్పీ ఆగ్రహం
01-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలంలోని పేద ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నెలల తరబడి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ చెక్కులు అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పైగా తహసీల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే సంతకాల కోసం లబ్ధిదారులనే తిరగబెట్టడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.ఎన్నిసార్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగినా సంతకాలు లేకపోవడంతో పేద ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఇది వారి గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, ఈరోజు చిన్నంబావి మండల కేంద్రానికి విచ్చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి బీఎస్పీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, లబ్ధిదారులకు చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అధికారుల అలసత్వం కొనసాగితే ప్రజల తరఫున బీఎస్పీ ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడదని హెచ్చరించారు.