అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది.
బాబా సాహెబ్ డా.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది.
సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు బలహీన వర్గాల కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డా.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను రూపుమాపి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు.