గద్వాల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు బ్రాంచ్లకు మొత్తం సీట్లు భర్తీ
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలీసెట్ సీట్ల కేటాయింపు జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ తెలిపారు. సిఎస్సి 62,సిపిఎస్ 58,ఈసీఈ 60 సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేసి జూన్ 9వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
మొదటి సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి అనగా 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.