కర్నూలు నుంచి కంచుపాడు మీదుగా బస్సు సర్వీసులను నడపాలి

Jun 12, 2026 - 01:45
Jun 12, 2026 - 01:50
 0  2
కర్నూలు నుంచి కంచుపాడు మీదుగా బస్సు సర్వీసులను నడపాలి

జిల్లాలో ఉన్న మేజర్ గ్రామాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి

ఆర్టీసీ సమ్మె కాలం హామీలను అమలు చేయాలి

--సురవరం విజయలక్ష్మి ఏఐటీయూసీ జాతీయ నేత.

రీజినల్ మేనేజర్ పి సంతోష్ కుమార్ కి వినతి.

 కర్నూలు నుంచి కంచుపాడు మీదుగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, అలాగే గద్వాల జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపి వేసి ఉన్న మేజర్ గ్రామాలకు బస్సు సర్వీసులను పూనా ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులోతేవాలని,తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రథచక్రాలకు ఊపిరైన ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ప్రభుత్వంలో విలీనం, యూనియన్స్ పునరుద్ధరణ డిమాండ్ ను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ జాతీయ నేత సురవరం విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏఐటీయూసీ  అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతృత్వంలో మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ:- ఆర్టీసీ కార్మికులు రక్త మాంసంలను కరిగించి ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. లక్షలాదిమంది పేదలకు నిత్యం ఆర్టీసీ బస్సు ద్వారా గమ్యాలకు క్షేమంగా చేరవేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తిలోదక విధానాలతో నిత్యం కార్మికులు అనేక ఇబ్బందులకు, వేధింపులకు,పని భారలతో బస్సు స్టీరింగ్ పైన ఊపిరి వదులుతున్నారని వాపోయారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం కార్మికుల శ్రమ ఫలితమేనని అన్నారు. గత పాలకుల నియంతృత్వ పోకడలతో ఆర్టీసీ రంగంలో యూనియన్స్ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం, సమ్మె కాలంలో ప్రభుత్వం అంగీకరించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం,యూనియన్స్ పునరుద్ధరణ చేయాలని సూచించారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట మారుస్తే ప్రభుత్వ మనగాడ సాధ్యం కాదని ఇతవుపలికారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు, సిపిఐ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి బి బాలకీష్, ఏఐటీయూసీ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పి.సురేష్, సిపిఐ ఉండవల్లి మండలం కార్యదర్శి నాగార్జున, గద్వాల జిల్లా ఏఐటీయూసీ నాయకులు పాముల ఆంజనేయులు రైతు సంఘ్ అధ్యక్షుడు, మహిళా సంఘం నేత అరుణ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో 
నాగార్జున 
సిపిఐ మండల కార్యదర్శి 
ఉండవల్లి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333