అంధకారంలో ఉన్న గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ వార్డులు
జోగులాంబ గద్వాల 24 జనవరి2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో అంధకారంలో భీంనగర్ స్రవంతి హాస్పటల్ వెనకాల నుండ ఎస్వీఎం కాలేజ్ వెనకాల వరకు మరియు కృష్ణ వేణి కాలేజీ వరకు రాత్రి పూట వెలగని వీధి దీపాలు. వార్డు ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారు. రాత్రి వేల బయటకు వెళ్లాలంటే భయం వేస్తుంది అని కాలనీ ప్రజలు సోషల్ మీడియాకు మొర పెట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ అధికార్లకు మొర పెట్టుకున్న పట్టించుకోవడంలేదని తెలిపారు. దయచేసి మున్సిపాలిటీ కమిషనర్ ఇప్పటికయినా స్పందించి ఆ కాలని లో వీధి దీపాలు వేయించగలరని వార్డు ప్రజలు కోరుతున్నారు.