అంగన్వాడీలో చోరీ
తిరుమలగిరి 26 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
గడ్డపారతో తలుపులు తాళం తొలగించి మరి...
ఎవరు చూడకుండా విద్యుత్ వైర్లు తొలగింపు....!
పిల్లల కోసం నిల్వ ఉంచిన రెండు నెలల సరిపడా సరుకు...
సిసి ఫుటేజ్ పరిశీలన....!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని కొక్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ గడ్డపారతో తలుపులు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి, చిన్న పిల్లల కోసం నిల్వ ఉంచిన వస్తువులను దొంగలించారు రాత్రి సమయంలో అంగన్వాడి సెంటర్లో విద్యుత్ వైర్లను తొలగించి ఎవరూ లేని అవకాశాన్ని , వినియోగించుకొని రెండు గ్యాస్ సిలిండర్లు, రెండు ప్రెజర్ కుక్కర్లు, సుమారు 30 ప్లేట్లు, గిన్నెలు, బాలామృతం ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, 36 లీటర్ల పాలు ప్యాకెట్లు, వంట వస్తువులను, సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు అంగన్వాడీ టీచర్ భూక్య హీరోని తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇట్టి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు . పేదల పిల్లలకు సంబంధించిన వస్తువులనే దొంగలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.. వారి వెంట ఐసిడిఎస్ సూపర్వైజర్ కైనిరుస కానిస్టేబుల్స్ సైదులు సంజీవ చారి వివిధ అంగన్వాడి టీచర్స్ ఉన్నారు