ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న వివిధ స్వయం సహాయక సంఘంలోని మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక విభాగం మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి అవగాహన సదస్సులో డ్వాక్రా సంఘాల మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలలో పనిచేసే మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారని వారు ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా రుణాలు పొంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి, పివో మెప్మా రేణుక, సి ఓ వెంకన్న, శ్రీనిధి మేనేజర్ రామారావు, సీఆర్పీలు విజయరాణి, రాణి, అర్చన చంద్రకళ తదితరులు పాల్గొన్నారు