నెలవారి సమీక్ష సమావేశం డాక్టర్ రాధిక
జోగులాంబ గద్వాల 1జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ఈరోజు నెలవారి సమీక్ష సమావేశం పిహెచ్సి ఇటిక్యాలలో డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో ఏఎన్ఎం లకు మరియు సూపర్వైజర్లకు మీటింగ్ తీసుకోవడం జరిగింది .ఇందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల నమోదు సంఖ్యను పెంచాలని మరియు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసవాలు జరగాలని సూచించారు ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లరాదని సూచించారు ఆరోగ్య కార్యక్రమాలను అన్నింటిని 100% టార్గెట్ అచీవ్మెంట్ చేయాలని సూచించారు .మరియు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నందున తర్వాత నిల్వ నీరు ఇండ్ల యందు ఉండరాదని సూచించారు. ఎవరికైనా జ్వరము వస్తే పీహెచ్సీకి పంపాలని సూచించారు మరియు అలాగే ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ కూడా పీహెచ్సీలో జరుపుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని ఆరోగ్యకరమాలపై రివ్యూ తీసుకోవడం జరిగింది.