వరుణదేవుడు కరుణ కోసం గ్రామాల వరద పాశం

Jul 8, 2024 - 07:08
 0  10
వరుణదేవుడు కరుణ కోసం గ్రామాల వరద పాశం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల పరిధిలో నసీంపేట సకాలంలో వానలు కురవాలి పంటలు సమృద్ధిగా పండాలి ఆత్మకూరు (యస్ ) వాన దేవుడా కరుణించవా.... అంటూ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నశింపేట గ్రామంలో విత్తిన విత్తనాలు మొలకెత్తక మొలకెత్తిన మొక్కలకు వర్షాలు లేక ఎండిపోతుంటే చూడలేక తట్టుకోలేక ఇప్పటికైనా వర్షాలు పడితే తమ పంటలను కాపాడుకుంటామని రైతులు ఆశతో వర్షాలు పడాలని,పంటలు సమృద్ధిగా పండాలని వరుణుడికి ఆదివారం వరద పాశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎలాంటి తారతమ్యం లేకుండా బొడ్రాయికి, ముత్యాలమ్మ తల్లికి,గంగాదేవమ్మ తల్లికి, ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి పసుపు కుంకుమలతో అలంకరించి నీటితో అభిషేకం చేసి వరుణ దేవుడిని వేడుకున్నారు. అనంతరం గ్రామస్తులు చెరువు దగ్గరికి వెళ్లి కట్టమసమ్మ తల్లిని పూజించి, చెరువులో ఉన్న నీళ్లను పూలతో పూజించి ఆ నీటిని తెచ్చి గంగను కడిగి అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన కొంచెం కొంచెం బియ్యం, బెల్లము, పాలు, కొబ్బరి కుడుకలతో పాయసం వండి వరునికి నైవేద్యం గా ఒక రాతి బండపై పోసి మగ పిల్లలతో ఆ వరద పాశం ని చేతితో తాగకుండా నాలుకతో ఆ నైవేద్యాన్ని స్వీకరించారు అనంతరం మహిళలు చప్పట్లు వేస్తూ వరుణ దేవుడిని వేడుకున్నారు. సామూహిక భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు