రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ 

Mar 18, 2024 - 18:31
 0  11
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ 

సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది.  మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. 

ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి. హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..

హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333