బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ప్రమాదంలో ఒకరు మృతి..మరొకరికి గాయాలు

Sep 8, 2026 - 11:37
 0  1

అడ్డగూడూరు 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి స్టేజి వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తులను ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మరో వ్యక్తికి త్రీవ రక్తస్రావం కారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మరణించిన వ్యక్తి ఊర సోమన్న తండ్రి రామచంద్రు వయసు 30 వృత్తి కూలీ గ్రామం చౌల్లారామారం గాయపడిన వ్యక్తి పెస్తం జంపన్న తండ్రి వెంకట్ నర్సయ్య వయసు 30 సంవత్సరాలు కులం జంగాల గ్రామం అనంతారం తిరుమలగిరి విరు ఇద్దరు పాటిమట్ల క్రాస్ రోడ్ నుండి కి  చౌల్లారామారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కంచనపల్లి బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు(యాదగిరిగుట్ట డిపో) బస్సు వారి వాహనాన్ని వెనుక వైపు నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న సోమన్న తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు వాహనం నడుపుతున్న జంపన్నకు రక్తస్రావంతో కూడిన గాయాలయ్యాయి అతనిని108 వాహనంలో హైదరాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333