సీరియల్ కిల్లర్ ని అరెస్ట్ చేసిన పట్టుకున్న బూత్ పుర్ పోలీసులు

Jun 29, 2024 - 19:56
 0  6
సీరియల్ కిల్లర్ ని అరెస్ట్ చేసిన పట్టుకున్న బూత్ పుర్ పోలీసులు

చింతలకుంట గ్రామ కేటిదొడ్డి మండలం గద్వాల జిల్లా నివాసుడు బోయ కాసమాయ్యా @ ఖాసీం కూలి పని చేస్తాడు, సుమారు 2 ½  సంవత్సరాల క్రితం నేరస్తుడు గ్రామము వదిలి మహబూబ్ నగర్ కు వచ్చి అక్కడక్కడ కూలి పని చేసి వచ్చిన డబ్బంతా తాగడానికి తినడానికి ఖర్చు పెట్టి బస్టాండ్లలో ఫుట్ పాత్ ల మీద పడుకునేవాడు, తాగుడుకు మరియు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు ఆడవారికి డబ్బు ఇస్తానని ఆశ చూపి వారిని చెట్ల పోద్దల్లోకి తీసుకోనిపోయి శారీరకంగా అనుభవించిన తర్వాత నేరస్తుడు వారికీ డబ్బులు ఇవ్యకుండా చంపాలనుకొని నిర్ణయించుకుంటాడు. సుమారు ఒక నెల కిందట టి.డి గుట్ట మహబూబ్ నగర్ లేబర్ అడ్డ వద్ద ఉన్న లక్ష్మి ని నేరస్తుడు తీసుకోని అమిస్తాపూర్ గ్రామము దాటిన తర్వాత కొద్ది దూరంలో ఉన్న పెద్ద బ్రిడ్జి దాటిన తర్వాత రోడ్ కు ఎడమ వైపున కొత్తగా నీర్మించిన బేస్మెట్ లోకి పోయి అక్కడ  నేరస్తుడు, లక్ష్మి తో శారీరకంగా కలిసిన తర్వాత ఆమె నేరస్తున్ని డబ్బులు అడుగగా, డబ్బులు ఇవ్యకుండ నేరస్తుడు అనుకున్న ప్రకారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతములో తన  వద్ద ఉన్న తువాల తీసుకొని ఆమె మెడకు చుట్టి బిగించి, తన జేబులో ఉన్న బ్లేడ్ తీసుకొని ఆమె గొంతును కోసి, ఆ తర్వాత అక్కడే ఉన్న గ్రానేట్ రాయి తీసుకొని ఆమె ముఖముపై మోదీ చంపినాడు, ఆ తర్వాత ఆమె కాళ్లకు ఉన్న వెండి పట్టీలు తీసుకొని పోయినాడు మరియు నేరస్తుడు జిల్లాలోని ఈ క్రింద కనపరచిన కేసులలో నిందితుడిగా వున్నాడు.  
Cr. No 108/2024 u/s 376, 379, 302, 201 IPC of Bhoothpur PS 
Cr. No 162/2023 u/s 302 201 IPC of Bhoothpur PS
Cr. No 252/2022 u/s 174 Cr.PC  Hanwada PS 
Cr,No84/2023 u/s 174 Cr.PC Wanaparthy Rural PS 
Cr,No178/2023 u/s 302 IPC of Bijinapally PS 
Cr,No136/2024 u/s 174 Cr.PC of M’Nagar Rural PS

నేరస్తుని నుండి కాళ్ళ వెండి పట్టీలను స్వాధీనం చేసుకొనడం జరిగినది. 
ఈ కేసు చదనలో పాల్గొన్న బూత్ పుర్ CI రామకృష్ణ, బూత్ప్రు SI శ్రీనివాసులు, సత్యనారాయణ, HC -1454 మూసాపేట్ PS, MD జమీర్ PC 2272 అడ్డకల్ PS, నవీన్ కుమార్, PC-3068, బూత్ పుర PS, MD ఇబ్రహీం, PC -936 అడ్డకల్ PS  గార్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి . జానకి, IPS గారు అభినందించారు.

PRO 
తేది 29.06.2024.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333