పోలీసు శాఖ ఉత్తమ సేవా పథకాల్లో అదరగొట్టిన షాద్ నగర్
షాద్ నగర్ ఏసిపి ఎన్.సి రంగస్వామికి ఉత్తమ సేవా పథకం
షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాప్ లింగంకు ఉత్తమ సేవా పథకం
అందమైన ప్రపంచాన్ని అదిమి పెట్టుకొని, బాధను పిడికిలి గుండెలో దాచిపెట్టి, బీటు డ్యూటీలో నైటంతా గస్తీ చేస్తే ఈ నగరమంతా హాయిగా నిదురపోయే.. కానరాని కలవరాన్ని కెమెరా కన్నుతో రెక్కి చేస్తే కల్లొలిత ప్రాంతమంత కనుల నిండ పండుగాయే.. అంటూ పోలీసు సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పోలీసు శాఖకు రెండు ఉత్తమ సేవ పథకాలను రాష్ట్ర డిజిపి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఈ మేరకు శనివారం ఉత్తమ సేవ పథకాలతో పాటు అనేక సేవా పథకాలకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఇందులో విశేషం ఏమిటంటే షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి ఎన్.సి రంగస్వామికి ఉత్తమ సేవా పథకం వరించింది, అదేవిధంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాప్ లింగంకు సైతం ఉత్తమ సేవా పథకం లభించింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిని ప్రదర్శించిన ఈ అధికారులకు ఉత్తమ సేవలను గుర్తించి పోలీసు డిజిపి బాస్ ఉత్తమ సేవా పథకాలను ప్రకటించారు. 1996 బ్యాచ్ కు చెందిన రంగస్వామి తన విధి నిర్వహణలో అనేక కఠినతరమైన కేసులను ఛేదించారు.
పోలీసు శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన సాగించారు. అదేవిధంగా 1998 బ్యాచ్ కు చెందిన కొండ ప్రతాప్ లింగం ఉత్తమ సేవా పథకాలను వరించడం మరో విశేషం. నియోజకవర్గంలో ఇద్దరు అధికారులకు ఒకేసారి సేవ పథకాలు రావడంతో పోలీసు శాఖలోని సిబ్బందికి సంతోషాన్ని నింపుతుంది. త్వరలోనే ఉత్తమ సేవ పథకాలను ఈ అధికారులు అందుకోబోతున్నారు. పట్టణ సీఐ ప్రతాప్ లింగం గతంలో 9 ఏళ్ల పాటు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ప్రత్యేక రక్షణ విభాగంలో పనిచేశారు. విధి నిర్వహణలో ముక్కుసూటితనం బాధితులకు సత్వనయం చేసే విధంగా ఆయన పేరుపొందారు. ఈ ఇద్దరు అధికారులకు నియోజకవర్గ ప్రజల తరఫున ఆల్ ది బెస్ట్.