సిపిఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

తొండ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు.
కార్మికుల సంక్షేమమే ఎర్రజెండా ధ్యేయం :
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లంల యాదగిరి
తిరుమలగిరి 02 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తొండ గ్రామంలో బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లంల యాదగిరి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దేశంలోని చికాగో నగరంలోని హేమా అనే మార్కెట్ యార్డులో 1885 వ సంవత్సరంలో మే ఒకటవ తేదీన అక్కడ ఉన్న కంపెనీ యజమానులు కార్మికులతో 18 గంటలు పని చేయించుకొని శ్రమదోపిడి చేస్తుంటే అక్కడ ఉన్న కార్మికుల అంతా ఐక్యమై మేము 18 గంటలు పనిచేయము మీరు ఇచ్చే కూలికి ఎనిమిది గంటలు పని మాత్రమే చేస్తామని శాంతియుతంగా మార్కెట్ యార్డులో సమ్మె చేస్తుంటే అక్కడ కంపెనీ యజమాన్యులు ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై కార్మికులపై కాల్పులు జరిపినారు. అక్కడికక్కడే ఆరుగురు కార్మికులు చనిపోగా మిగతా కార్మికులకు కాళ్లు, చేతులు విరిగి గాయాలై రక్తం ఏరులై పారితే చావగా మిగిలిన కార్మికులు వారి వంటి పైన ఉన్న చొక్కాలు చింపి రక్తంలో ముంచి ఎత్తినదే ఎర్రజెండా. ఆనాటి నుండి కార్మికులు కమ్యూనిస్టులు ప్రతి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాలు ఎగురవేసి వారికి జోహార్లు అర్పించి, కార్మికులు ఐక్యంగా ఉండాలని శపథం చేశారు. అలాగే నేటి పాలకులు కార్మిక చట్టాలను సవరించి కార్మికుల హక్కుల ను హరిస్తూ కంపెనీ యజమానుల పక్షాన ఉండికార్మికులకు అన్యాయం చేస్తున్నారు. అందుకే సమస్త కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమరశీల పోరాటాలు చేసి, కార్మికుల హక్కులను సాధించాలని సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తిపిరాల శ్రీకాంత్,కనుక అశోక్,ఎండి ఎగ్బాల్, జంపాల మల్లయ్య, సుంచు సత్తయ్య,ఎర్రగట్టు రాజాలు,ఎల్లంల కొమరయ్య,ముత్యాల యాకన్న , తిపిరాల అంజయ్య , నాగుల గాని మల్లయ్య,కుదురుపాక ఉప్పలయ్య, కొమురెల్లి, జంపాల స్వరూప, చింతకింది బుచ్చమ్మ,పోరెల్ల ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.