ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదవి విరమణ సన్మానం
తిరుమలగిరి 02 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి యందు గత 25 వసంతాలుగా జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్ హెచ్ ఎం ద్వారా నైట్ డ్యూటీ వాచ్ మన్ (రాత్రి కాపలదారుడుగా) పనిచేసి నేడు పదవి విరమణ పొందిన బొబ్బల అంజయ్య - లింగమ్మ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమానికి డాక్టర్ మల్లెల వందన పాల్గొని మాట్లాడుతూ ఏ స్థాయిలో అయిన తన ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లైతే ప్రజలలో మంచి గుర్తింపు పొందవచ్చునని ప్రజల మన్ననలను పొందవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో ,CHO మాలోతు బిచ్చునాయక్, డాక్టర్ పద్మావతి,సూపర్ వైజర్ స్వరూప కుమారి, పల్లె దవాఖానా డాక్టర్లు, అరోగ్య సిబ్బంది పాల్గొన్నారు