సాయి గాయత్రి విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు

Oct 1, 2024 - 16:54
Oct 1, 2024 - 19:21
 0  8
సాయి గాయత్రి విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు

మునగాల 01 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- సాయి గాయత్రి విద్యా లయ లో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మునగాల మండల  కేంద్రంలోని సాయి గాయత్రి విద్యా లయలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ రావడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని , అలాగే బతుకమ్మ ప్రాముఖ్యత గురించి దాని విశిష్టత గురించి పిల్లలకు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థినులు మరియు ఉపాధ్యాయినులు బతుకమ్మ లను తయారు చేసి బతుకమ్మ ఆట పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అర్వపల్లి శంకర్ గారు, ఉపాద్యాయ బృందం మరియు విద్యార్థినులు విద్యార్ధులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State