విజయ విహారం రమణమూర్తి పై దాడి హిందూ సమాజంపై జరిగిన దాడే

Jul 17, 2026 - 18:17
Jul 17, 2026 - 18:22
 0  1
విజయ విహారం రమణమూర్తి పై దాడి హిందూ సమాజంపై జరిగిన దాడే

సూర్యాపేట 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రచయిత, హిందూ ఆధ్యాత్మికవేత్త రమణమూర్తి పై బి ఆర్ కె న్యూస్ ఛానల్ లో లైవ్ డిబేట్ నడుస్తుండగా జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైనదని దీన్ని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జై భారత్ బీసీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి వెంకన్న మాట్లాడుతూ ఈ దాడిని హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు.హిందూ మతంలో ఆర్ఎస్ఎస్ విషపురుగులు చేరాయని వారిది వినాశన ధర్మం అయితే జైభారత్ సంస్థది సనాతన ధర్మమని పేర్కొన్నారు. హిందూ మతంలో విద్వేషం ఉన్మాదం లేదన్నారు విమర్శకు స్థానం ఉందన్నారు. తాము రాముడు కృష్ణుడు హనుమంతుడినీ ఆరాధించే విశ్వసించే ప్రజల పక్షమేనని చెప్పారు. కోట్లాదిమంది పూజించే దేవి దేవతలను రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల బిచ్చగాళ్ళుగా వాడుకోవటం ఏమిటని చెప్పారు. రాముడిని మోడీని ఒకే చోట పెట్టి సమవుజ్జీలుగా ఎలా చూస్తారని విమర్శించారు.

అయోధ్య రామ మందిరంలో గత 40 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకే విహెచ్పి ఆర్ఎస్ఎస్ ముసుగులో దాడులు జరుగుతున్నాయి అన్నారు. గతంలో రంగరాజన్ పై జరిగిన దాడి వెనక మతోన్మాద శక్తులు ఉన్నాయని నేడు కశ్యపురెడ్డి ముసుగులో ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంస్థలు రమణమూర్తి పై దాడి చేశాయని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రజలు వందల ఏళ్లుగా శాంతి క్రమశిక్షణతో ఐక్యంగా జీవిస్తున్నారని తమ విశ్వాసాలను పాటిస్తూనే పరాయి మతాలను గౌరవిస్తున్నారని మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడుక్కునే దుస్థితి వచ్చిన తర్వాత మత ఘర్షణలు చెలరేగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, విమర్శించే హక్కు వంటి  మౌలిక హక్కులను మన రాజ్యాంగం కల్పించిందన్నారు. రచయితలు, పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను ప్రజల ముందు పెడుతారు ఇది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత అవసరం అని చెప్పారు. భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారా ఎదుర్కోవాల్సింది పోయి, హింస, బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం, వాటిని ప్రశ్నించే రచయితలు, మేధావులు, సామాజిక విశ్లేషకులపై దాడులు చేయడం తీవ్రంగా ఖండించాలన్నారు. సత్యాన్వేషి, సమదర్శి, మానవతావాది రమణమూర్తి పై జరిగిన దాడిని ఖండించాలని, రమణమూర్తి కి ప్రభుత్వం తక్షణమే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వావిళ్ళ రమేష్ గౌడ్ (బి సి స్టూడెంట్  రాష్ట్ర అధ్యక్షులు), నవిల ఉపేందర్ (దళిత హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి), గొడ్డలి నరసన్న, గంగారపు శ్రీను (దళిత నాయకులు), బొల్లెద్దు వినయ్ (మాల మహానాడు జిల్లా అధ్యక్షులు), మహేష్ చారి (బి సి విద్యార్థి సంఘం నాయకులు ) దడిపల్లి వెంకట్ (సామాజిక తెలంగాణ మహాసభ సూర్యాపేట జిల్లా కన్వీనర్) జర్నలిస్ట్ రమణ, ఖదిజ్ఞాసి రేణుక ( జై భారత్ సామాజిక విప్లవ రణభేరి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి) ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333