ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద... ప్రైవేట్ అంబులెన్స్ ల దందా

gobernament hospital suryaper

Jun 9, 2024 - 20:03
Jun 9, 2024 - 20:09
 0  71
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద... ప్రైవేట్ అంబులెన్స్ ల దందా
gobernament hospital suryaper

వీరు చెప్పిందే.. వేదాం.. ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే...

ముఖ్య కారకులు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందే

18,000 నుండి 25000 వసూలు

ఈ సంఘానికి ఒకరు అధ్యక్షులు

వీరి దందాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు

సూర్యాపేట 10 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ ల  దందా విపరీతంగా పెరిగిపోయింది. నియంత్రణ లేకపోవడంతోనే వాళ్లు పాడిందే పాట అనే విధంగా వారి చెప్పిందే వేదంగా గడుస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా ఉంది.. దీనికి ప్రధాన కారణం ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది..  

ప్రైవేట్ అంబులెన్స్  ఉన్న వారు కూడా ఒక సంఘం లాగా ఏర్పడి సీరియల్  ప్రకారంగా పోవాలని వారికి వారే నిర్ణయించుకొని , సీరియల్ ప్రకారమే అంబులెన్స్ సర్వీస్ నడుపుతామని వాదించి అందిన కాడికి అందుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆ సంఘానికి ఒక అధ్యక్షునిగా ఒకరిని ఎన్నుకొని ఈ దందాను నెలకొల్పినట్లు తెలుస్తుంది.. నార్మల్ అంబులెన్స్ కు 5000 నుండి 10000.. వెంటిలేటర్ సౌకర్యం ఉందని సాకు చూపిస్తూ మరో అంబులెన్సు లాకు 18 వేల నుండి 25000 పేషెంట్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది..

దీనికి ప్రధాన కారణం

హాస్పటల్లో పనిచేస్తున్న కొంతమంది అంబులెన్స్ లను సొంతంగా కొనుక్కొని వారే ఈ దందాకు తెర లేపినట్లు వినికిడి... ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే అంబులెన్స్ సర్వీసులు బయట ప్రైవేటుగా నడుపుతున్నారో వారిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..ఆస్పత్రికి సంబంధించిన అంబులెన్స్ లు తక్కువగా ఉండటం కూడా  ఇందుకు కారణం అని పలువురు వాపోతున్నారు...

స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి 

ఇప్పటికైనా కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఏరియా ఆసుపత్రికి కొన్ని అంబులెన్స్లను ఉచితంగా అందించాలని ప్రజలు కోరుతున్నారు..

డిఎంహెచ్వో స్పందించాలి 

డిఎంహెచ్వో కోట చలం స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ ల అడ్డాలను  తొలగించాలని  DMHO ను ప్రజలు కోరుతున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333