విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే.. మూగజీవుల ప్రాణాలు కోల్పోతున్నాయి

May 28, 2026 - 00:59
May 28, 2026 - 01:00
 0  0
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే.. మూగజీవుల ప్రాణాలు కోల్పోతున్నాయి

అడ్డగూడూరు 27 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన ఎండి అబ్దుల్ కాళిక్ తండ్రి ఎండి ఆఫ్జల్  కు చెందిన పాడి  గేదె అడ్డగూడూరు పెద్ద చెరువు కట్ట పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద  మేతమేసుకుంటూ వెళ్లిన పాడి గేద ట్రాన్స్ఫారం కు తగలడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందినది.బాధిత రైతు కన్నీరు పెట్టారు.బాధిత రైతు మాట్లాడుతూ..మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సమస్య ట్రాన్స్ఫారం చుట్టూ రక్షణ కవచం కల్పించకపోవడం.. కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగి పై ఉంది.కానీ ఆ మాట తుంగలోతోకిన విధంగా వ్యవహరిస్తున్నారు.ఒక గేదె, ఆవు,గొర్రె,కాదు మనుషుల ప్రాణాలు కూడా పోవచ్చు..ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.రైతు గేదె ప్రమాదానికి గురి కావడం వల్ల గేదె నుండి వెలువడే పాలు ఉపాధి కోల్పోయినట్లు బాధిత రైతు అన్నారు.సుమారు గేద విలువ 80 వేల రూపాయలు నష్టం జరిగిందని.ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరారు.