సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణికి ఘన సన్మానం

Aug 31, 2026 - 19:03
 0  2
సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణికి ఘన సన్మానం

వివిధ ప్రజా, కుల సంఘాల నాయకుల మర్యాదపూర్వక భేటీ

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి కే. లతను సోమవారం వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులుమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అధికారిణి కే. లతను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అర్హులైన ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, సామాజిక వర్గాల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ జాతీయ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు యాతాకుల రాజన్న మాదిగ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు వినయ్, దళిత సామాజిక నాయకులు, పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్, నాయి బ్రాహ్మణ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333