సమాజంలో అభద్రత భావం కల్పించే వారిపై కఠిన చర్యలు

Jun 17, 2026 - 11:49
Jun 17, 2026 - 12:19
 0  10
సమాజంలో అభద్రత భావం కల్పించే వారిపై కఠిన చర్యలు

హద్దు దాటితే దండనే.

నాన్ బెయిలబుల్ వారెంట్ తో జైలుకు పంపుతాం.

రౌడీ షీట్స్ నమోదు చేసి వ్యక్తిగత వివరాలు జియో టాగింగ్ చేస్తున్నాం.

చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినదే.

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.

సూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హెచ్చరించారు. సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టించే వారిపై, ఇరు వర్గాల దాడులు, మద్యం మత్తులో దాడులకు పాల్పడే యువతపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ తో జైలుకు పంపడం, రౌడీ షీట్స్ నమోదు చేసి ప్రతి నెలా పోలీస్ స్టేషన్ కు పిచి కౌన్సిలింగ్ చేస్తాం. ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా, సమాజంలో అభద్రతా వాతావరణం కల్పించిన అలాంటి వారిని ఉపేక్షించం, చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినదే అన్నారు. సందర్భాన్ని తీవ్రతను బట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కన బెట్టి చట్టానికి పని చెప్తాం అని హెచ్చరించారు. పాత నేరస్తులు, తీవ్రమైన కేసుల్లో ఉన్న నిందితుల పై నిఘా ఉన్నది ఎక్కడ తిరుగుతున్నారు అనేది పరిశీలించడానికి వ్యక్తిగత వివరాలు, ఫోన్స్ జియో టాగింగ్ చేసి ప్రత్యేక బీట్ బృందాలతో పర్యవేక్షణ చేస్తున్నాం.

కాలనీల్లో రోడ్ల వెంట అడ్డాల చేసుకుని ఇబ్బందులు పెడుతున్న ఆకతాయిల సమాచారాన్ని ఫోటోలు, విడియోలు తీసి 8712686026 కు పోలీసు వారికి సమాచారం ఇవ్వండి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333