సమస్యలకు నిలయం అయిజ కస్తూర్బా గాంధీ విద్యాలయం

Jun 13, 2024 - 19:27
Jun 13, 2024 - 20:52
 0  18

అయిజ మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు S.రాంచంద్రా రెడ్డి

జోగులాంబ గద్వాల 13 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ. మున్సిపాలిటీ పరిధిలో గల కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు S..రాంచంద్రా రెడ్డి పరిశీలించి, మాట్లాడుతూ.....

1. బాలికల వసతి గృహంలో పై చెత్తు/స్లాబ్ నాణ్యత లోపం వల్ల పై పెచ్చులు ఊడి పడిపోయాయి. సమయానికి విద్యార్థులు లేరు కాబట్టి సరిపోయింది లేకుంటే పిల్లల ప్రాణాలు ఏమైపోయేవి అని వాపోయారు.. 

2. బాలికల మరుగుదొడ్లు వసతిలో ఔటర్ పైపు లైన్ లేకపోవడం చేత ఆడపిల్లలు ఆరుబయటకి వెళ్లలేక ఎవరికీ చెప్పలేక  మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వాడుకోలేక ప్రక్కనే ఉన్న జూనియర్ కళాశాల మరుగుదొడ్లను  వాడుతున్నారు. ఇలా నిరుపయోగంగా ఉన్న వాటిని వెంటనే మరమ్మతులు చేపించాల్సిందిగా సంబందింత డిపార్ట్మెంట్ లేదా కాంటాక్ట్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను అని చెప్పారు.

3. వరండా స్టడీ హాల్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎగుడు డిగిడుగా ఉన్న ప్రదేశంలో వర్షపు నీరు చేరి, కీటకాలు, పురుగులు, కాల్ జెర్రీ లకు నివాసం అయ్యింది,, అలాంటి ప్రదేశాల్లో పిల్లలు ఎలా చదువుతారు అని దిగ్రాంథి చెందారు.

4. ఆరుబయట సరదాగా ఆటలు ఆడేందుకు కనీస సౌకర్యాలు కూడా లేవు,, ఎక్కడ పడితే అక్కడ వాన నీటి నిలువలు ఉన్నాయి. 

కావున పై విషయాల మీద ప్రత్యేక చొరవ తీసుకుని, సంబంధిత అధికారులచే సమస్యలను పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం అని జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. అలాగే సీట్ల విషయానికొస్తే సీట్లు  రెట్టింపు చేయాలని ఎందుకనగా లక్షకు పైగా అయిజ పట్టణ మండల జనాభా ఉందని, దీనితోపాటు   తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తరువాత ఆర్థిక స్తోమత లేని వలస వెళ్లే కుటుంబాల విద్యార్థులకు సీట్లు కేటాయించి, వారి భవిష్యత్ కి పునాదివేయాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు భీమ్ సేన్ రావు, వీరయ్య చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి, పట్టణ సోషల్ మీడియా ఇంచార్జ్, చిన్నికృష్ణ, రాజశేఖర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు...

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State