పదవికోసమ -పట్టుకోసమ

Dec 20, 2025 - 18:36
 0  7
పదవికోసమ -పట్టుకోసమ

అడ్డగూడూరు 20 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఇప్పుడు జరుగుతున్న అన్ని రాష్ట్ర రాజకీయాలలో నాయకులు పదవికోసమో..పట్టుకోసమో.. 
ప్రజలకోసమో..లేక పరపతి కోసమో...తెలియదు గాని 
ఎన్నో పాట్లుపడతారు. 
అవమానాలను భరిస్తారు 
ఆర్ధికంగా నష్టపోతారు కొందరు
మరికొందరు బలపడతారు.
రాణించాలి అంటె బాష బాగుండాలి వేషంతొ ఆకర్శించాలి!
మంచిగా కనపడాలి!
మనుషులలొ కలిసిపోవాలి!
ఏ పార్టీ నాయకులైన
విమర్శించుకున్నవారు సైతం కలిసినపుడు పలకరించుకుంటారు.
పక్క పక్కనె కూర్చుంటారు.
అవకాశన్ని బట్టి పార్టీ మారుచుంటారు. 
కొట్లాడుతు కూడ,అదే పార్టీలొ కొనసాగుచుంటారు, అంతర్గత ప్రజా స్వామ్యమని సర్దుకుంటారు.
అవకాశాల కొరకు ఎదురు చూస్తారు.ఏ పార్టీ వారితోనైనా
బంధుత్వం కలుపుకుంటారు
వ్యాపారం కలిసి చేసుకుంటారు.
స్నేహితులై తిరుగుచుంటారు
కార్యకర్తలకు మాత్రం
మరి ఎందుకొ పట్టింపులు
పార్టీ వెరైతె పక్క పక్క నున్న పట్టించుకోరు,పలకరించుకోరు
నాయకులను చూసి నేర్చుకోవాలి!
వారిలాగ కాలం గడపాలి
ఎన్నికలపుడే రాజకీయాలనుకోవాలి,  కుటుంబానికి,మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.రచన:–కడెం. ధనంజయ నల్గొండ జిల్లా:– శాలిగౌరారం మండలం:– చిత్తలూర్ గ్రామ వాసి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333