గ్రామపంచాయతీ ఎన్నికలలో బీజేపీ కొత్త వెంకట్ రెడ్డి విజయం
17-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలలో గూడెం గ్రామంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బిజెపి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి కొత్త వెంకట్ రెడ్డి 44 ఓట్ల తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మామిళ్ళపల్లి చక్రవర్తి పై ఘన విజయం సాధించారు.
బెక్కిం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి అల్లం కురుమూర్తి పై కమల భాయ్ 24 ఓట్లతో గెలుపొందారు.
పెద్ద మారు గ్రామంలో కేత పాగు జయమ్మ కాంగ్రెస్ అభ్యర్థి 308 ఓట్లతో విజయం సాధించింది.
గెలిచిన గ్రామాలలో సంబరాలలో మునిగిపోయిన గ్రామాలు.