జూపల్లి పర్యటనతో, చక్రం తిప్పుతున్న చక్రవర్తి సైన్యం
14-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల గూడెం గ్రామంలో జూపల్లి పర్యటనతో ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ
జూపల్లి రాకతో గ్రామంలో సైన్యంలా కలసి పనిచేయటానికి, సర్పంచ్ గెలుపు కోసం కంకణ బద్దలుగా మారుతున్న జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తలు.
గెలుపుకు కృషి చేయండి.పార్టీ కార్యకర్తలకు,గ్రామ ప్రజలకు అండగా నేనుంటా? జూపల్లి
గొప్ప మనసున్న యువ నాయకుడు, మానవత్వంతో ఉన్న,సామాన్యుడు, ప్రజల మనిషిని గుండెలకు హద్దుకుందాం. అదే మన లాయర్ చక్రవర్తిని అని జూపల్లి కృష్ణారావు అద్భుతమైన ఉపన్యాసంతో కార్యకర్తల్లో జోష్ నింపాడు.
గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధిలో అడుగులు వేసి,శ్రీకారం చూడతాం. జూపల్లి
గ్రామంలో చాలామంది వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
కత్తెర గుర్తు తో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మామిళ్లపల్లి చక్రవర్తికి మనమందరం కలిసి పెద్ద మెజారిటీతో విజయాన్ని అందిందాం. అని జూపల్లి అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మామిళ్ళపల్లి చక్రవర్తి తో పాటు మామిళ్ళపల్లి కురుమయ్య, మండల అధ్యక్షుడు అయినటువంటి శేఖర్ యాదవ్, కళ్యాణ్ రావు, అల్లం రవి, పెద్ద గాలి అన్న, మహేష్, కుమ్మరి బుచ్చన్న, క్యాతూరి రాముడు, డీలర్ వెంకటయ్య, శ్రీశైలం, మేఘరాజు బత్తుల నారాయణ, ఆది, శివ సాగర్, వార్డు నెంబర్ సభ్యులు, కార్యకర్తలు
అధిక సంఖ్యలో పాల్గొన్నారు.