సమయపాలన పాటించని ఆర్టీసీ సిబ్బంది సమయానికి రాని బస్సులు
అవస్థలు పడుతున్న విద్యార్థులు మరియు ప్రయాణికులు

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల రాయచూరు రూట్ బస్ ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే. సమయానికి బస్సులు నడపకపోవడం తో ఇలా విద్యార్థులు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇలాగే సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు మరియు ప్రయాణికులు ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు మరియు ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు .
ఇప్పటికైనా ఆర్టీసీ డిఎం స్పందించి సమయానికి బస్సులు నడపాలని ప్రయాణికులు మరియు విద్యార్థులు కోరుతున్నారు