ఐజ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి
తక్షణమే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్
జోగులాంబ గద్వాల 30 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల* విద్యార్థి సంఘాల నాయకుల పైకి దాడికి ప్రేరేపించిన స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి పై జిల్లా కలెక్టర్ కి ఈరోజు ప్రజావాణిలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.. ఈనెల జూన్ 27న శుక్రవారం నాడు PYL విద్యార్థి సంఘం జిల్లా నాయకులు దానయ్య మరియు కార్యదర్శి హరీష్ గాంధీ చౌక్ లో ఉన్న శ్రీ చైతన్య ప్రైవేటు హైస్కూల్లో బుక్కులు ఉన్నాయి అనే సమాచారంతో వెళ్లి అక్కడ బుక్కులు అమ్ముతా ఉంటే పట్టించి MEO కు సమాచారం అందించారు. ఎంఈఓకు సమాచారం అందిన పిదపా తక్షణమే ముందుగా ఈ స్కూలుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కృష్ణవేణి స్కూలు యజమాని మధుసూదన్ రెడ్డి వచ్చారు. తరువాత MEO వచ్చారు అని దానయ్య తెలిపారు. అటు పిమ్మట తక్షణమే మధుసూదన్ రెడ్డి స్కూల్లో బస్సు లకు డ్రైవర్ లుగా పనిచేస్తున్న వారిని పిలిపించి విద్యార్థి సంఘాల నాయకుల పైకి దుర్భాషలాడుతూ దాడి చేసే విధంగా ప్రేరేపించడం దుర్మార్గం. తక్షణమే అక్కడ జరిగిన గొడవలో ఎంక్వయిరీ చేసి ఎవరెవరు అక్కడికి వచ్చారో మరియు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కృష్ణవేణి స్కూల్ యజమాని, వారి డ్రైవర్స్ దేనికోసం ఆక్కడికి వచ్చారు.. రౌడీయిజం చేయడానికి వచ్చారా..?
మీ డ్రైవర్స్ నీవు అక్కడ ఉండాల్సిన సమయంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు..?
మధుసూదన్ రెడ్డి నువ్వు విద్యాసంస్థలు నడుపుతున్నావా లేకుంటే గుండాయిజం చేయడానికి విద్యాసంస్థలలో పనిచేస్తున్న వారిని ప్రేరేపిస్తున్నావా? అని అన్నారు.
బుక్కుల పేరుతో, దుస్తుల పేరుతో టై బెల్టుల పేరుతో వేల రూపాయలు దోచుకుంటూ కోట్లు సంపాదించి ఇవాళ రౌడీయిజంను ప్రేరేపిస్తున్నావా నీ స్కూల్లో..
పేద తల్లిదండ్రుల దగ్గర డబ్బుల దోపిడి చేస్తూ నర్సరీ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క విద్యార్థికి 50 నుంచి 60 వేలు తీసుకుంటూ భారీ దోపిడీ చేస్తున్నావ్ అయినా సిగ్గు లేదు నీకు అని అన్నారు.
నీ స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తున్నావా..? విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఫ్రీగా సీట్లు ఇస్తున్నావా..? నీ స్కూల్లో ఉన్న అంతమందికీ కరెక్ట్ గా లెట్రిన్స్ ఉందా...బాత్రూమ్స్ ఉన్నాయా..? ఫైర్ సేఫ్టీ ఉందా..?
రూల్ 15 సెక్షన్ 4 D) ప్రకారం నీవు తీసుకుంటున్న ఫీజులో 50% టీచింగ్, నాన్ టీచింగ్, సిబ్బంది జీతాలకు చెల్లిస్తున్నావా..?
ప్రైవేట్ పుస్తకాలను అమ్మకూడదని గవర్నమెంట్ విద్యా విధానం చెప్తా ఉంటే నడిరోడ్డులో పట్టపగలే దోపిడి.
దోపిడీ చేయడమే కాకుండా విద్యార్థి సంఘాల నాయకులకు పైకు దాడి చేయడానికి ప్రేరేపిస్తావా..? అని అన్నారు.
త్వరలోనే నీస్కూల్లో ఏమేమి దోపిడీ జరుగుతుందో, నీవు ఏమేమి చేస్తున్నావో అన్ని బయటకు వస్తాయి అని అన్నారు.
తక్షణమే ఆ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని కలెక్టర్ కి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో కరికులం హైస్కూల్లో పట్టుబడ్డ బుక్కులను కూడా ఎంఈఓ తో సీజ్ చేయించాం అక్కడ కూడా ఏ సమస్య రాలేదు..
అదేవిధంగా మల్దకల్ ప్రైవేట్ స్కూల్లో బుక్కులు పట్టుపడితే అక్కడ కూడా సీజ్ చేయించాం అక్కడ ఏ సమస్య రాలేదు.
మరి ఐజా మండల కేంద్రంలో శ్రీకృష్ణవేణి స్కూల్లో బుక్కులను సీజ్ చేయగానే ఎందుకు ఇంత రాదాంతం చేస్తున్నారో..మరి దీని వెనక ఎవరెవరున్నారో ఏందీ అనేది త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇందులో నిష్పక్షపాతంగా విద్యార్థి సంఘం నాయకుల పైకి దాడికి ప్రేరేపించినా వ్యక్తి మధుసూదన్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాం లేని పక్షంలో త్వరలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, నడిగడ్డ పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, తిరుమలేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.