ఘనంగా కొండా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి
జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలంగాణ రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనియర్ జర్నలిస్టు కొండ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ సామాజిక ,ఆధ్యాత్మిక సేవకులుగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. రూప టైప్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులు స్వశక్తి మీద నిలబడేటట్లు, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి నిత్యం పాటుపడుతూ, అందరి మన్నలని పొందిన శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి చాలు వాళ్ళతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ నాయకులు మహంకాళి సోమయ్య అక్కినపల్లి సత్యనారాయణ, చల్లా చుక్కారావ్, నరేంద్రుని మనోహర్, మురికి రమేష్, ఆర్యవైశ్య సంఘ నాయకులు గోపారపు రాజు, నవిలిపురి నరేందర్, సుమన్ యువసేన జిల్లా అధ్యక్షులు గుండా వెంకన్న, ఉప్పలవంచు కృష్ణ చిత్తలూరి శ్రీధర్ రావు మనసాని నాగేశ్వరరావు, కోటగిరి శ్రీనివాస్, కొండా నర్సింహా రావు, వాస చంద్రశేఖర్,చల్లా శ్రీనివాస్, ఇరానీ నవాబ్ రాము, గుణగంటి మధు, కిషోర్, రాచకొండ శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.