ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల ఆందోళన.
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండలం బీచుపల్లి వద్ద ఉన్న తెలంగాణ గురుకుల బాలుర ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు కాలినడకన జిల్లా కలెక్టర్ కార్యలయం వద్దకు బయలుదేరారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. హాస్టల్లో బోజనం సరిగా లేదని, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే టార్గెట్ చేసి కొడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థుల ను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని, అన్నారు. పిల్లలను సస్పెండ్ చేసి గురుకుల సీట్లను అమ్ముకుని కొత్తవారికి సీట్లు ఇస్తున్నాడని అన్నారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ ఛెయాలని విద్యార్థులు కోరారు.