సంపూర్ణ ఆరోగ్యానికి చక్కని సాధనం యోగా
గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సునీల
సూర్యాపేట; 22 జూన్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- శారీరక, సామాజిక, మానసిక ఆరోగ్యాలకు యోగా అవసరమని, తనువును మనసును ఆత్మను ఏకం చేసే ఒక సాధనమే యోగా అని గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుక్క సునీల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కళాశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్ర, ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి సంయుక్త ఆధ్వర్యంలో వాలంటీర్లు,సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసి విద్యార్థులకు యోగ పై అవగాహన కల్పించి మాట్లాడారు. మందుల ద్వారా నయం కానీ ఎన్నో రుగ్మతలను యోగాతో జయించవచ్చు అన్నారు. యోగతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి రోజు యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి ప్రవళిక, ఎన్ఎస్ఎస్ పిఓ బి రమ్య, జి అరుణ, ఎం సునీత, ఎండి నస్రీన్, డి సాహితి, ఎస్ స్పందన తదితరులు పాల్గొన్నారు.