జాతీయ అవార్డు అందుకున్న దగ్గడ్ ప్రేమ్
విజయవాడ 28 ఆగస్టు 2024తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఆంధ్రప్రదేశ్ విజయవాడ అమరావతి నడిబొడ్డున హనుమంతురామా పౌర గ్రంధాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మల్లాది ప్రసాదరావు వారి ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమంలు చేసిన వారిని గుర్తించి 4,5 రాష్ట్రాలు వారికి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా రాయదుర్గం గ్రామాలో అతి చిన్న వయసులో ఏనో గొప్ప కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శనంగా నీళ్లస్తున్న దగ్గడ్ ప్రేమ్ కి ప్రఖ్యాత డా.ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవా రత్న అవార్డు అందజేశారు.ఈ సందర్బంగా దగ్గడ్ ప్రేమ్ మాట్లాడుతూ..మా సేవలను గుర్తించి ఒక పవిత్రమైన రోజుగా భావించే మదర్ థెరీసా పుట్టినరోజు నా మదర్ సర్వీస్ సొసైటీ రెండవ వార్షికోత్సవ జరుపుకోవడం ఒక మహాత్రమైన కార్యక్రమాన్ని చేసి అందులో మమ్మల్ని కూడా భాగస్వామినీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అనీ తెలియచేసారు.ఈ అవార్డు ఇచ్చిన మదర్ సర్వీస్ సొసైటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు, భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమంలు చేపడతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ఎమ్మెల్యేలు, సినీ ఆర్టిస్టులు, నేషనల్ ఎన్జీవో ప్రతినిధులు, టీవీ ఆర్టిస్టులు,రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతి నిధులు సింగర్లు తదితరులు పాల్గొన్నారు.