రొయ్యల వాహనం బోల్తా ఎగబడ్డ స్థానికులు....
కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల చెరువు వద్ద జాతీయ రహదారిపై విజయవాడ నుండి హైదరాబాద్ రొయ్యల లోడుతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.రొయ్యల వాహనం బోల్తా పడినట్టు స్థానికులకు తెలియడంతో పెద్ద ఎత్తున వాహనం వద్దకు చేరుకొని రొయ్యలను ట్రైలలో ఎత్తుకొని వెళ్లారు. హైవే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు......