పేద విద్యార్థికి లైన్స్ క్లబ్ చేయూత

భద్రాచలం టౌన్
లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తమ్మిశెట్టి గణేష్ ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితుల్లో లైన్స్ క్లబ్ ను ఆశ్రయించగా భద్రాచలం క్లబ్ స్పందించి వారి తల్లిదండ్రులకు 18,500 లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం సభ్యుల సహకారంతో వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడం ఎంతో సంతోషకరదాయమని అన్నారు. విద్యార్థి మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకాల బహుముఖ కార్యక్రమాలను చేపడుతున్నామని చిరు వ్యాపారస్తులకు గొడుగులు అందించడంతోపాటు అనేక రకాల సేవ కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. భవిష్యత్తులో లైన్స్ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి జి భరత్ కుమార్, పి దేశప్ప, పి సోమశేఖర్, భోగాల శ్రీనివాసరెడ్డి, జిఎస్ శంకర్రావు, g. భూపతి రావు, ఎం సిద్ధారెడ్డి, ఆంజనేయ రెడ్డి, నేలపట్ల ప్రవీణ్ రెడ్డి, రామలింగేశ్వరరావు, బాసినేని రామకృష్ణ, ఉప్పాడ ప్రసాద్ రెడ్డి, కడాలి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.