పదేండ్ల బిజెపి, బిఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదు
రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం
-సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి
పాలమూరు న్యాయ యాత్ర 13వ రోజులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్, మహబూబ్ నగర్ మండలం, అలివేలు మంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం కోట కద్ర ,పోతాన్ పల్లి, మాచన్ పల్లి రామచంద్రపూర్ కోడూరు క్రాస్ రోడ్ మీదుగా యాత్ర కొనసాగుతూ బొక్కలోనిపల్లి లో కార్నర్ మీటింగ్ లో చల్లా వంశీచంద్ రెడ్డిగారు మాట్లాడారు.
సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గార్ల సమక్షంలో మండల అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కొటకద్ర లో 60 మంది టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు
మాచన్పల్లిలో మాజీ టీఆర్ఎస్ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఓబ్లాయిపల్లి టిఆర్ఎస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు
బొక్కలోని పల్లి కార్నర్ మీటింగ్ లో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు పాలమూరు పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ
➡️ఈనెల 11 వ తారీకు నుంచి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు కట్టిస్తాం
➡️త్వరలో రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తామని హామీ
➡️ప్రజాపాలన లో కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ ప్రతి హామీ నెరవేరుస్తుందని తెలియజేశారు
➡️6వ తేదీన జరగబోయే ప్రజా దీవెన సభ ను అందరూ విజయవంతం చేయాలని కోరారు
➡️బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నట్టేట ముంచారని ఇప్పటివరకు ఆ ఉద్యోగాల ఊసే లేదన్నారు
➡️ప్రజాపాలనలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వస్తున్నాయని, గత ప్రభుత్వాలు నిరుద్యోగులను విస్మరించాలన్నారు
వారితో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, pcc ఉపాధ్యక్షులు ఒబెదుల్ల కొత్వాల్, సురేందర్ రెడ్డి గారు, ఎన్ పి వెంకటేష్ గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు , మండల అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి గారు కార్యకర్తలు మరియు అధిక మొత్తంలో పాల్గొన్నారు