అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో కన్వర్జెన్సీ సమావేశం.

Aug 20, 2026 - 18:39
 0  4
అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో కన్వర్జెన్సీ సమావేశం.

జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కన్వర్జెన్సీ సమావేశానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. జె. సంధ్య కిరణ్మై ముఖ్య అతిథిగ హాజరయ్యారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, యుక్తవయస్కులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగ అమలు చేయాలని సూచించారు. అదేవిధంగ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అనుబంధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సంబంధిత శాఖలన్నీ పరస్పర సహకారంతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా,, ప్రసూనరాణి, డా,, కిషోర్ సివిల్ సర్జన్, డా,, వరలక్ష్మి DGO మరియు వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం DMHO డా,, సంధ్య కిరణ్మయి మానోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ తనిఖీ చేశారు. హాజరు పట్టిక, వివిధ రికార్డులను పరిశీలించి, ప్రసూతి గది, ఇన్‌పేషెంట్ వార్డును సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు వైద్య సిబ్బందికి పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333