పదవి విరమణ వీడ్కోలు సమావేశంలో
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పదవి విరమణ వీడ్కోలు
సమావేశం లో పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
తెలంగాణవార్త ప్రతినిధి ఖమ్మం ది.02.03.2025 నగరంలోని మంచికంటి భవన్ నందు సత్తుపల్లి సదాశివునిపేట గ్రామంలో పశువైద్యశాలలో పనిచేస్తున్న వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు పదవి విరమణ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమేనని రాయల నాగేశ్వరరావు అన్నారు..
వెంకటేశ్వర్లు విధులపరంగా పనిచేసి పలువురి మన్ననలు పొందారాన్నారు.. వివిధ గ్రామాలలో పశువైద్యసేవాలు అందించి రైతుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు.. పదవి విరమణ అనంతరం వారి జీవిత కాలంలో వారి ఆయురారోగ్యం పట్ల శేష జీవితం గడిపేందుకు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు.. అనంతరం తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, అతని సతీమణి భవానీ ను శాలువా పూలమాలలతో సత్కరించారు..