శివపార్వతులను దర్శించుకున్న చిన్నంబావి మండల మాజీ జడ్పిటిసి

26-02-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల మాజీ జెడ్పిటిసి కేశిరెడ్డి వెంకట్ రమణమ్మ, చిన్నారెడ్డి మహాశివరాత్రి సందర్భంగా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో లలితాంబిక సోమేశ్వర ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.చిన్నంబావి మండల మాజీ జడ్పిటిసి కెసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి చిన్నంబావి మండల ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షురాలు లక్ష్మీ కురుమయ్య ఈ సందర్భంగా చిన్నంబావి మండల మాజీ జెడ్పిటిసి గారికి ఆలయ కమిటీ నుండి ఘనంగా సన్మానం చేయడం జరిగినది. మహాశివరాత్రి పర్వదినంగా ప్రజలు తండోపతండాలుగా భక్తులతో పాటు మాజీ జెడ్పిటిసి భక్తిశ్రద్ధలతో లలితాంబికా సోమేశ్వరి జ్యోతిర్లింగాలను దర్శించుకుని పూజలు చేసి కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ మహా శివుడి ఆశీస్సులు ఉండాలని పూజించారు.