ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ గణన చేపట్టాలి 

 బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు డిమాండ్ 

Aug 30, 2026 - 15:13
Aug 30, 2026 - 15:24
 0  5
ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ గణన చేపట్టాలి 

గరిడేపల్లి-సూర్యాపేట, 29 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ గణన చేపట్టాలని ఇప్పటికే అనేక దశాబ్దాలుగా బీసీలు వివక్షతకు గురవుతున్నారని అందువల్ల ఇప్పుడు జరుగుతున్న జన గణనలో కులగణన చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.... కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ జన గణనలో ఎస్సీ ఎస్టీలను లెక్క కట్టినట్లుగా బీసీలను లెక్కించాలని లేకపోతే బిజెపి పార్టీ దాని మిత్రపక్షాలు తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జాతీయ కుల గణన చేస్తున్న క్రమంలో ఎస్సీ ఎస్టీలకు లెక్కలు ఉన్నట్లే బిసి కులాల లెక్కలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన లాగానే జనగణలలో బీసీల సంఖ్యను నమోదు చేయాలని ప్రస్తుతం కులగణ న లో భాగంగా ఉన్న ప్రస్తుత ప్రశ్నావళి ని రద్దు చేయాలని స్పష్టంగా ఉండే కొత్త ప్రశ్నావళి  రూపొందించాలని జనాభాకు చెందిన సమాచార డేటా దుర్వినియోగం కాకుండా చూడాలని కచ్చితంగా డేటా లేకపోతే విద్య ఉపాధి సంక్షేమం సరిగా అమలు చేయలేమని రాజకీయ పార్టీలు నిపుణులతో సంప్రదించి కొత్త ప్రశ్నవళి రూపొందించాలని తెలంగాణ బీహార్లలో అవలంబించిన విధానాలు అనుసరించాలని ఆయన సూచించారు,  అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికల కింద కేటాయించిన నిధులను దారి మళ్ళించటం లేదా సంక్షేమ అభివృద్ధికి సక్రమంగా వినియోగించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. షెడ్యూలు కులాలు షెడ్యూల్డ్ తెగలకు  చెందిన వారిపై జరుగుతున్న అఘాయిత్యాల కేసులను త్వరితగతిన  పరిష్కరించాలని బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూడటానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉపప్రణాళిక నిధులను ఎలాంటి మళ్ళింపు లేకుండా జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి సంక్షేమ కోసం మాత్రమే ఖచ్చితంగా ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333