గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా..గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్

Feb 4, 2026 - 21:04
 0  18
గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా..గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్

   అడ్డగూడూరు 4 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.గ్రామంలోని నిత్యం ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఫోన్ చేసి గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. నన్ను ఆదరించిన గ్రామ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని ఏ సమస్య పైన అయినా నన్ను కలవడానికి వచ్చిన గ్రామ ప్రజలకు అందుబాటులో  ఉంటానని అన్నారు.గ్రామంలోని నీళ్ల సమస్య,కరెంటు సమస్య,గ్రామంలోని బజార్ల సమస్యపై తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు దృష్టికి తీసుకుపోయి గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333