శాంతిభద్రతల రక్షణ, నేరాల నివారణలో భాగంగా జిల్లా పోలీస్ డ్రైవ్..
ఆపరేషన్ చబుత్రా లో భాగంగా అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
లాడ్జిలు, హోటల్స్, దాబాలు, ట్రాన్స్పోర్ట్ అడ్డాలు, బస్టాండ్ లు, నిర్మానుష్య ప్రదేశంలో పోలీసు బృందాలు విస్తృత సోదాలు జరిపాయి.
జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ చబుత్రా కార్యక్రమం చేపట్టి రాత్రి 11 గంటల నుండి అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలో సిఐ వెంకటయ్య అధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనుమానం ఉన్న వ్యక్తుల వెలుద్రలు తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాం అని సిఐ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటాం అన్నారు. రాత్రింబవళ్ళు ప్రజల రక్షణలో పని చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు సందీప్ రెడ్డి, మహేందర్, వెంకన్న, సిబ్బంది ఉన్నారు.