వ్యక్తి మరణానికి కారణం అయినా వ్యక్తి కి 6 నెలల జైలు శిక్ష,1500/- రూపాయాల జరిమానా
జోగులాంబ గద్వాల 13 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ట్రాక్టర్ తో బైక్ కు టక్కర్ ఇవ్వడం ద్వారా వ్యక్తి మరణానికి కారణం అయిన కేసులో ట్రాక్టర్ డ్రైవర్ కు 6 నెలల జైలు శిక్ష , ట్రాక్టర్ ఓనర్ కు 1500/- రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిన ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గద్వాల్ వెంకట హైమ పూజిత అతి వేగంగా,అజాగ్రతగా ట్రాక్టర్ నడుపుతూ ముందు వెల్లె బైక్ ను టక్కర్ ఇవ్వడం ద్వారా బైక్ పై వెళ్లే వ్యక్తి మరణానికి కారణం అయిన కేసులో నిందితుడు A 1 ట్రాక్టర్ డ్రైవర్ కు 6 నెలల జైలు శిక్ష, నిందితుడు A 2 ట్రాక్టర్ ఓనర్ కు 1500/ రూపాయాల జరిమానా విధిస్తూ ఈ రోజు ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గద్వాల్ వెంకట హైమ పూజిత తీర్పు వెల్లడించారు.కేసు వివరాలు మల్దకల్ మండలo తాటికుంట గ్రామానికీ చెందిన పుట్ట స్వామి దాస్ తేది 10.05.2019 నాడు మల్దకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ రోజు తన చిన్న కుమారుడు అయిన పుట్ట ఉదయ్ కుమార్ , వయసు -16 సం"లు, అదే గ్రామానికి చెందిన తోటి మిత్రులు అయిన కాషాపోగు ఇజ్రాయెల్, వయసు -17 సం "లు, చిన్న ఇజ్రాయెల్, వయసు -12 సం"ల తో కలిసి పొలం లో కలంగడి పల్లు తీసుకొచ్చేందుకు తాటికుంట స్టేజికి గ్రామానికీ చెందిన దేవదాసు బైక్ బజాజ్ CT 100 నం TS 06 EB 7005 పై వెళుతుండగా అతివేగంగా, అజాగ్రత్తగా వెనక నుండి ట్రాక్టర్ టక్కర్ ఇవ్వగ వెనుక కూర్చున్న తన చిన్న కుమారుడు పుట్ట ఉదయ్ కుమార్ కు బలమైన రక్త గాయం అయి చనిపోయాడు అని పోన్ ద్వారా సమాచారం రాగా తాను తన కుటుంబ సభ్యులను, బందువులను తిసుకొని అక్కడకు పోయి చూడగా తన కుమారుడు కన్ను కు, కడత కు బలమైన రక్త గాయం అయి చనిపోయి ఉండేను, మిగతా ఇద్దరిలో ఒకరు చేయి కు గాయమైనది అని , అట్టి ట్రాక్టర్ వివరాలు తెలుసుకొనగా మాన్ దొడ్డి గ్రామానికి చెందిన ట్రాక్టర్ ట్రాలి నం AP 39N 1054 , ఇంజన్ no AP 39 H 7465 గా ఉన్నదని తరవాత తన కుమారుడి డెడ్ బాడీ ను గద్వాల్ ప్రభుత్వా హాస్పటల్ మార్చరి కు చేర్చడం జరిగిందనీ కావున తన కుమారుడు మరణానికి కారణం అయిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇవ్వగా పోలీసులు క్రైమ్ నం 55/2019 u/s 304- A, 337 IPC గా కేసు నమోదు చేయడం జరిగింది. తరవాత జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు బైక్ పై వెళుతున్న వారిని వెనుక నుండి ట్రాక్టర్ అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి టక్కర్ ఇవ్వగా బలమైన రక్త గాయం అయి మరణించింది విచారణలో నిజమని తేలడంతో ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్ ఓనర్ లను నిందితులుగా చేర్చడం, తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు IPS ఆదేశానుసారం కోర్టులో కేసు ట్రయల్ సమయంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె . గుణ శేఖర్ పర్యవేక్షణలో డి. ఎస్పీ శ్రీ సత్యనారాయణ , గద్వాల్ సిఐ భీమ్ కుమార్, మల్దకల్ ఎస్సై సురేష్ గౌడ్ కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గద్వాల్ వెంకట హైమ పూజిత* కేసులో నిందితుడు అయిన A 1- బోయ వెంకటేష్ s /o రాముడు, వయసు -18 సం "లు, కులం - బోయ, వృత్తి - డ్రైవర్ ,R/o మాన్ దొడ్డి గ్రామం, రాజోలి మండలoకు 6 నెలల జైలు శిక్ష, A 2- U. రంగా రెడ్డి s/o రామ కృష్ణ రెడ్డి, వయసు - 34 సం "లు, వృత్తి - అగ్రికల్చర్, R/o మునుగాల గ్రామం, గూడూరు మండలం, కర్నూలు జిల్లా కు 1500/- రూపాయాల జరిమానా విదిస్తూ తీర్పు వెల్లడించారు.నేరస్థులకు జైలు శిక్ష పడడానికి అసిస్టంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి . భవానీ ,కోర్ట్ కానిస్టేబుల్ రాం దాస్ సహకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు అయిన కృష్ణ ఓబుల్ రెడ్డి ,ప్రస్తుత ఎస్సై సురేష్ గౌడ్, కోర్టు కానిస్టేబుల్ రాం దాస్ ల ను జిల్లా ఎస్పీ అభినందించారు.