మానాయకుంట గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

Jan 21, 2025 - 23:47
Jan 22, 2025 - 09:24
 0  113
మానాయకుంట గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

అడ్డగూడూరు 21 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మానాయకుంట గ్రామంలో ప్రజా పాలన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మందల సామేల్ ప్రజా పాలన సభను ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాల అమలు కొరకు జరిగిన గ్రామ సభలు నిర్వహించారు.ప్రజా పాలన సభలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడం కోసమేనని అన్ని పథకాలు ప్రతి ఒక్క పేద అర్హత కలిగిన అందరికీ అందుతాయని,లిస్టులో పేరు రాలేదని చింతించకుండా వాళ్ళు మరల దరఖాస్తులు చేసుకోవచ్చని అని తెలియజేశారు.ప్రత్యేక గ్రామసభలు ద్వారా అర్హులందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని ప్రతి ఒక్క పేద బిడ్డకి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల గ్యారెంటీ తప్పకుండా అమలు చేసి తీరుతామని అని అన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు మానాయికుంట అంటేనే మహనీయుల కుంట అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అడ్డగూడూరు స్పెషల్ ఆఫీసర్ కృష్ణ ఎంపీడీవో శంకరయ్య మరియు ఎమ్మార్వో శేషగిరిరావు ప్రభుత్వ అధికారులు మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.