జూనియర్ హాకీ నేషనల్ టోర్నమెంట్ కు వనపర్తి జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఈనెల 9వ తేదీ నుండి 19వ తేదీ:-వరకు పంజాబ్ రాష్ట్రం, జలంధర్ పట్టణం లో నిర్వహించే జూనియర్ హకీ నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి తెలంగాణ జాతీయజట్టుకు వనపర్తి జిల్లాకు చెందిన
1) తేజ
2) బొలమోని కౌశిక్
3)భాస్కర్
4)దివాకర్ అనే వనపర్తి హాకీ క్రీడాకారులు ఎంపికైనట్లు హాకీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొలెమోని కుమార్ తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికైనటువంటి క్రీడాకారులను తెలంగాణ హాకీ వైస్ ప్రెసిడెంట్ మరియు మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటూరి శ్రీనివాస్ గౌడ్ , వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు
పి మన్యం,
గద్వాల హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ఆనంద్
వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ ట్రెజరర్
S.నిరంజన్ గౌడ్
వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్
రామ్మోహన్ ఫిజికల్ డైరెక్టర్ అనిల్ కుమార్. సీనియర్ క్రీడాకారులు అభినందించారు
వనపర్తి జిల్లా క్రీడాకారులకు జాతీయ జట్టులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హాకీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కొండా విజయ్ కుమార్ మరియు భీమ్ సింగ్ గారికి వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలియచేశారు.
వనపర్తి జిల్లా కేంద్రం లో అస్ట్రో టర్ఫ్ ఏర్పాటు కు ప్రభుత్వం చొరవ చూపాలి.
వనపర్తి జిల్లాకు చెందిన దాదాపుగా 170 మంది హాకీ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయ క్రీడలలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి క్రీడలు ఆస్ట్రో టర్ఫ్ లో నిర్వహించడం, వనపర్తి జిల్లా కేంద్రంలో టర్ఫ్ మైదానం లేకపోవడం వలన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్ట్రో టర్ఫ్ మైదానం ఏర్పాటు చేసినట్లయితే అత్యంత ప్రతిభ కలిగిన క్రీడాకారులను ,జాతీయస్థాయి మరియు భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని, వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ పత్రికా ముఖాన రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుందని తెలిపారు