చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన మోత్కూర్ పోలీసులు...
ఇద్దరు స్నాచర్లు అరెస్టు, మూడున్నర తులాల గోల్డ్ రికవరీ ఒక కారు, రెండు ఫోన్లు సీజ్...
మోత్కూర్ 06 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-చైన్ స్నాచింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకున్నా ఎంతో చాకచక్యంతో రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మోత్కూరు పోలీసులు కేసు చేదించి ఇద్దరు దొంగలను అరెస్టు
చేశారు. మోత్కూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఇద్దరు దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.బెదిరించి దోపిడీలు చేయడం, ఒంటరిగా ఉన్న మహిళల మెడలోంచి బంగారు చైన్లు దొంగతనం చేస్తున్నారని, దొంగతనం చేసే ప్రాంతాల్లో ఐదారుసార్లు రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. వారి నుంచి మూడున్నర తులాల పుస్తెలతాడు రికవరీ చేసి,ఒక కారు,రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసి ఇద్దరు దొంగలను కోర్టుకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. చైన్ స్నాచర్లను ఎంతో కష్టపడి పట్టుకున్న కానిస్టేబుళ్లు నవీన్,ప్రవీణ్,వినోద్,శివ,శంకర్ శివకృష్ణలను అభినందించి రివార్డ్ అందజేశారు.మోత్కూరు ఎస్ఐ దొమ్మేటి నాగరాజు, ఏఎస్ఐలు శ్రీనివాస్,వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ ఆయన వెంట ఉన్నారు.