అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల .
గురువారం సుజాతనగర్ మండలం వేపలగడ్డ ఎంపీపీ ఎస్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో చేసిన పనులను పరిశీలించారు. ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ తీగలు బయటకు వేలాడటం గమనించి, పనులు తాత్కాలికంగా చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి మళ్లీ పాఠశాల తనిఖీకి వస్తానని, పనులు అన్ని నాణ్యత పాటిస్తూ శాశ్వత ప్రతిపదికపైన పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, , మరుగుదొడ్లు, ఫ్యాన్లు మరియు లైట్లు అన్ని సౌకర్యాలు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులు తిరిగి పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అన్ని హంగులతో నూతన విద్యా సంవత్సరం ఆరంభానికి ఏర్పాట్లు చేయాలనిఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, తాసిల్దార్ శిరీష, కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.