విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను సాదించాలి:జిల్లా ఎస్పీ రితిరాజ్
జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను సాదించాలి మరియు విద్యార్ధులు తమ లక్ష్య సాధనకు స్కూల్ దశ నుండే గొప్ప వ్యక్తులకు సంబంధించిన మంచి పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని, అలాగే మంచి స్నేహితులను కూడ ఎంపిక చేసుకోవడం అవసరం అని జిల్లా ఎస్పీరితిరాజ్ విద్యార్థులకు సూచించారు. శనివారం గద్వాల్ పట్టణ శివారు లోని వీరాపురం దగ్గర వున్న ఎస్సార్ స్కూల్ యాజమాన్యం విన్నపం మేరకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఇంటరాక్ట్ సెక్షన్ నిర్వహించి విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడం తో పాటు లక్ష్యాన్ని ఎలా చేరాలో పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు జీవితం లో ఉన్నత విజయాలను అందుకోవడానికి గొప్ప గొప్ప విజయాలు సాదించిన వారి చరిత్రలను , వారికి సంబంధించిన పుస్తకాలను ను చదవడం అలవర్చుకోవాలని మరియు విద్యార్థిగా ఎదిగే క్రమం లో తోటి స్నేహితులను మంచి వారిని ఎంపిక చేసుకోవాలని అన్నారు. సబ్జెక్టు లలో వచ్చే తక్కువ మార్కులను చూసి నిరాశ చెందవద్దు అని, నిరాశ చెందడం వల్ల సమయం వృధా అవడం తో పాటు మానసికంగా బాధను కలగజేస్తుంది అని అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. పై తరగతుల విద్యార్ధులు ఇప్పటి నుండే లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ దిశగా కష్టపడాలని అన్నారు.ప్రతి విద్యార్థి ఒక డ్రీమ్ ను ఎంపిక చేసుకొని అందుకు ఏమీ చేయాలో, ఎలా చేస్తే చేరుకోగలమో ఆలోచించాలని అన్నారు. అందుకు క్రమ శిక్షణ కూడ అవసరం అని క్రమ శిక్షణ అనేది జీవితం లో రొటీన్ బాగం కావాలని అన్నారు.ఎన్నో ఫేలుర్ తరువాత సక్సెస్ వస్తుందని కావున లక్ష్యాన్ని చేరే క్రమం లో ఎన్నీ ఓటములు చెందిన ప్రయత్నం చేయడం అపవద్దని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యల పై ఫైట్ చేస్తూ ముందుకెళ్లాలని,విద్యార్ధులు రోజు ఫిజికల్ యాక్టివిటీస్ చేయలని తద్వారా ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతారని అందుకు రోజు గేమ్స్ అడటం, రన్నింగ్ చేయడం అలవర్చుకోవాలని సూచించారు. మీ తల్లదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని, మీరూ ఏమి కావాలని అనుకుంటున్నారో వారికి తెలియజేసి నచ్చజెప్పాలి అని అన్నారు. మరియు హెల్మెట్ పెట్టుకోక పోవడం వంటి చిన్న చిన్న తప్పిదాల వాళ్ల ప్రతి సంవత్సరం ఎంతోమంది మరణిస్తున్నారు అనీ రోడ్ సేఫ్టీ నియమాలు పాటించడం ఎంత అవసరమో విద్యార్ధులకు తెలియజేశారు.ఆనంతరం విద్యార్ధులు చదువులో, జీవిత లక్ష్యాలను చేరే క్రమంలో ఉన్న సందేహాలను ఎస్పీ అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే ఎస్పీ విద్యార్థి దశ లో ఎదురయ్యే సమస్యలను ఎలా అధికమించారో విద్యార్థులకు తెలియజేశారు. పోలీస్ శాఖ గద్వాల్ ప్రజలకు ఏలాంటి సేవలు చేయలని అనుకుంటున్నారు అన్న విద్యార్ధి ప్రశ్నకు ప్రజలు తాము సురక్షితంగా ఉన్నాము అనుకునే విధంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల డైరెక్టర్ రాములు,ప్రిన్సిపాల్ నిది చౌహాన్, పాఠశాల స్టాఫ్ మరియు విద్యార్థినిలు పాల్గోన్నారు.