విద్యార్థులకు *కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేసిన తహశీల్దార్

Jan 29, 2026 - 20:29
 0  1
విద్యార్థులకు *కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేసిన తహశీల్దార్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేసిన తహశీల్దార్ ఆత్మకూర్ ఎస్.... జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ ఆదేశాల ప్రకారము ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెమ్మికల్ లో అవసరమున్న విద్యార్థుల పూర్తి వివరములు తీసుకొని మీసేవ ద్వారా ఆన్లైన్ చేసి వారికి కుల ఆదాయ ధ్రువీకరణ పత్రములను పాఠశాల లో తహశీల్దార్ అమీన్ సింగ్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ధారసింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.