లింగ నిర్ధారణ "" చట్టరీత్య నేరం

Dec 19, 2025 - 19:15
 0  25
లింగ నిర్ధారణ "" చట్టరీత్య నేరం
లింగ నిర్ధారణ "" చట్టరీత్య నేరం

 జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల తేదీ 19.12.2025 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. జె.  సంధ్య కిరణ్ మై " గర్భస్థ పిండ నిర్ధారణ నిరోధక చట్టం -1994 " అమలుపై  జిల్లా సలహా కమిటీ మెంబర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు..* ఈ సందర్భంగా DMHO  మాట్లాడుతూ.. జిల్లాల్లో 22 స్కానింగ్ సెంటర్లు ఉన్నావని, వీటిని రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు, స్కానింగ్ సెంటర్ నిర్వహించే క్వాలిఫైడ్ డాక్టర్స్ 5వ తారీఖు లోపు ఫామ్ -F ని (  గర్భిణీ స్త్రీ  ల కు చేసిన స్కానింగ్ ఫారములు ) PCPNDT పోర్టల్ లో ఆన్లైన్ చేసి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రతినెల 5 వ తేదీలోపు  ఇవ్వాలని ఆదేశించారు.., స్కానింగ్ సెంటర్ నిర్వహించే నిర్వాహకులు  ఎవరైనా, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, పుట్టబోయేది ఆడబిడ్డ లేదా మగ బిడ్డ అని తెలిపినచో, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి, చేయించుకున్న వారికి, PCPNDT చట్ట ప్రకారము  మూడు సంవత్సరముల జైలు శిక్ష, మరియు 50,000/- జరిమానా విధిస్తారని తెలిపారు.. ప్రతి రెండు నెలలకు ఒకసారి  సలహా కమిటీ మీటింగ్ నిర్వహిస్తామని,. గర్భస్థ పిండ  లింగ నిర్ధారణ నిరోధక చట్టం గురించి, కమిటీ మెంబర్స్ అందరూ ఫీల్డ్ లెవల్లో  లో ప్రజలకు అవగాహన కలిగించాలని, అదేవిధంగా, కిశోర బాలికలకు సమతుల ఆహారము గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, రక్తహీనత గురించి, చేతుల పరిశుభ్రత గురించి  అవగాహన కలిగించాలని కమిటీ మెంబర్స్ కి తెలిపారు.... ఈ సమీక్ష సమావేశానికి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి డాక్టర్. దమయంతి  (  ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది   డిపార్ట్మెంట్ గైనకాలజీ ), డాక్టర్ శిరీష  ( ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్  పీడియాట్రిక్స్ ), డాక్టర్. ప్రసూన రాణి(  మాత శిశు  సంరక్షణ అధికారి), కే. మధుసూదన్ రెడ్డి (i/c డిప్యూటీ. డెమో ), బి. నర్సింలు , ( డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్), G. నాగరాజు, G. నరసయ్య  (CEA - సెక్షన్), సఖి సెంటర్ నిర్వాహకులు  G. అరుణ (CA ),M. స్వాతి, ఎన్జీవో నిర్వాహకులు పరశురాముడు... పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333