విద్యార్థుల సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన చేసిన
యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్
అడ్డగూడూరు 23 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్షేమ వసతి గృహాల సందర్శన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన సోమవారం రోజుఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏఐఎస్ఎఫ్ సంక్షేమ హాస్టల్ సందర్శన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన జిల్లా లో మోత్కూరు మండల కేంద్రంలోనీ ఎస్పీ బీసీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి వివరంగా తెలుసుకున్నారు.మోత్కూర్ లోని బీసీ బాలుర బాలికల ఎస్సీ బాలికల బాలుర వసతి గృహాల్లో కామన్ డైట్ అమలు కావట్లేదని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చిన కామన్ డైట్ అన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కామన్ డైట్ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఫోన్ కాల్ ద్వారా సంబంధిత జిల్లా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
పరీక్షల సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సమయ పాలన పాటించాలని అన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతూ... చదువులో శ్రద్ధ వహించాలని, పరీక్షల సమయంలో క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు తమ హక్కుల గురించి తెలిసి,సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని,అన్ని రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ముందుకు సాగాలని ఆయన సూచించారు. అదనంగా,మూడ నమ్మకాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, స్వయం అభివృద్ధికి దోహదపడే మార్గాలను సూచించారు.విద్యార్థులు తమ సమస్యలను ఈ సందర్భంగా వెలువరించగా,వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, అభ్యాసం మెరుగుపరచడంలో ఏఐఎస్ఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ,మాజీ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్,మండల కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.